Kites Festival: అంతర్జాతీయ కైట్స్ ఫెస్టివల్ ను ప్రారంభించిన మంత్రి జూపల్లి
తెలంగాణ రాష్ట్రా భాషా సాంస్కృతిక, పర్యాటక శాఖల ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో మూడు రోజులపాటు నిర్వహించనున్న అంతర్జాతీయ కైట్స్ ఫెస్టివల్‌ను (Kites Festival,), మిఠాయిల ఉత్సవాల (Sweets Festival)ను మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao), రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించడం వల్ల పేదలు, కళాకారులు, నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలు మరుగున పడకుండా ఉండేందుకు ప్రజాప్రభుత్వం ఇలాంటి ఉత్సవాలను నిర్వహిస్తోందని తెలిపారు. విదేశీ కైట్ ఫ్లయర్లు వినియోగిస్తున్న వివిధ ఆకారాలు, రంగుల పతంగుల తయారీలో నగర యువతకు ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈసారి పతంగులు, మిఠాయిలతోపాటు హాట్ ఎయిర్ బెలూన్లు, డ్రోన్ల ఉత్సవాలను సైతం నిర్వహిస్తున్నామన్నారు. పరేడ్ మైదానంలో హాట్ ఎయిర్ బెలూన్ల ప్రదర్శనను తిలకించడంతోపాటు వాటిల్లో ప్రయాణించి కొత్త అనుభూతిని పొందేందుకు ప్రజలు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చని తెలిపారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






