Municipal Elections: మునిసిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతాం : రాంచందర్రావు
మునిసిపల్ ఎన్నికల్లో (Municipal elections) సత్తా చాటుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు (Ramachandra Rao) ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మునిసిపల్ ఎన్నికల్లో పొత్తుల్లేకుండా ఒంటరిగా పోటీ చేస్తామని, అయితే ఎవరైనా మద్దతిస్తే స్వాగతిస్తామన్నారు. జనసేన (Janasena) తెలంగాణలో పోటీ చేస్తే తప్పేముందన్నారు. బీజేపీ (BJP)తో కలిసి పోటీ చేస్తామని జనసేన ప్రతినిధులు తమతో సంప్రదింపులు జరపలేదని చెప్పారు. కవిత కొత్త పార్టీ గురించి తెలియదని, ఆస్తుల పంపకాల సమస్య తీరాక ఆమె పార్టీ పెడతారేమోనని వ్యాఖ్యానించారు. బీజేపీ ఎంపీలు వారి నివాసాల్లో సమావేశం కావడంలో తప్పేంలేదని, తనకు వ్యతిరేకంగా భేటీ అయ్యారన్న సమాచారం లేదని అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడి వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, బీజేపీ హిందువులతోపాటు, ముస్లిం, సిక్కుల ఓట్లనూ అడుగుతుందన్నారు. కాంగ్రెస్ వాళ్లు కేవలం ముస్లింల ఓట్లనే అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ నదీ జలాల అంశాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నాయని విమర్శించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






