Sankranthi: జాన్సన్ రోడ్లో సంక్రాంతి సంబరాలకు అంతా సిద్ధం..
హనుమాన్ దత్త యోగా సెంటర్ (HDYC), 9818 జాన్సన్ రోడ్, వాలిస్, TX 77485లో జనవరి 17, 2026 సంక్రాంతి సంబరాలకు అంతా సిద్ధమైంది. ఈ వేడుక కేవలం ముందుగా రిజిస్టర్ చేసుకున్న వారికి, వారి కుటుంబ సభ్యులకు మాత్రమే పరిమితం. ఇతరులకు ప్రవేశం లేదు.
పూజా సామాగ్రి: పూజ కోసం కేవలం పండ్లు, మిఠాయిలు, పూలు మాత్రమే తీసుకురావాలి. (టెంకాయలకు అనుమతి లేదు).
దుస్తులు, పాదరక్షలు: వేదిక వద్ద బూట్లు ధరించవచ్చు. వాతావరణం చల్లగా ఉన్నందున దానికి తగినట్లుగా సంప్రదాయ దుస్తులలో రావాలి.
బాధ్యత: పిల్లలు, మీ సామగ్రి (Luggage) పట్ల తల్లిదండ్రులే పూర్తి బాధ్యత వహించాలి. (పెంపుడు జంతువులకు అనుమతి లేదు).
ముగ్గులు: వేదిక వద్ద తీర్చిదిద్దిన ముగ్గులను చూసి ఆనందించండి, కానీ వాటిని తాకవద్దు.
పరిశుభ్రత: ప్రాంగణంలో చెత్త వేయకండి, కేవలం డస్ట్బిన్లను మాత్రమే ఉపయోగించండి.
గమనిక: వేడుక సమయంలో జరిగే ఎటువంటి సంఘటనలకు లేదా ప్రమాదాలకు HDYC, నిర్వాహకులు బాధ్యత వహించరు.






