TRIIA: ట్రైసిటీ ఇండియా అసోసియేషన్ (TRICIA) నూతన కార్యవర్గ ఎన్నిక
న్యూయార్క్: క్యాపిటల్ రీజియన్లోని భారతీయ ప్రవాస సమాజానికి సేవలందిస్తున్న ప్రతిష్టాత్మక సంస్థ ‘ట్రైసిటీ ఇండియా అసోసియేషన్’ (TRICIA) 2026 సంవత్సరానికి గాను తమ నూతన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను ప్రకటించింది. జనవరి 5న జరిగిన బోర్డు సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
కీలక నియామకాలు:
బోర్డ్ చైర్మన్: వివి రామిరెడ్డి ముప్పిడి (ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు).
బోర్డ్ వైస్ చైర్మన్: సునీల్ జాచ్ (ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు).
బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 2026: రామిరెడ్డి, సునీల్ లతో పాటు వివిధ కాలపరిమితులకు గాను మరికొందరు సభ్యులు బోర్డులో సేవలందించనున్నారు:
శ్రీధర్ పంత్యాల (2026 – 2028)
పాల్ ఉప్పల్ (2026 – 2028)
బాలమురుగన్ రామసుబ్రమణియన్ (2026 – 2028)
రామ్ లాలుకోట (2025 – 2027)
పీటర్ థామస్ (2025 – 2027)
అలీమ్ సమద్ (2025 – 2027)
దినేష్ దొండపాటి (2024 – 2026)
రవీంద్ర ఉప్పల (2026)
నరసింహన్ రంగనాథ (2024 – 2026)
వేద్ శ్రవ (2024 – 2026)
భారతీయ సంస్కృతిని, సంప్రదాయాలను అమెరికాలో భావి తరాలకు అందించడంలో TRICIA చేస్తున్న కృషిని అభినందిస్తూ, నూతన కార్యవర్గం నేతృత్వంలో సంస్థ మరింత ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.






