TAGKC: కాన్సాస్ సిటీలో ఘనంగా సంక్రాంతి సంబరాలు.. పోటీలకు రంగం సిద్ధం
కాన్సాస్ సిటీ: అమెరికాలోని కాన్సాస్ సిటీ తెలుగు అసోసియేషన్ (TAGKC) ఆధ్వర్యంలో 2026 ఏడాది మొట్టమొదటి వేడుకగా ‘సంక్రాంతి సంబరాలు’ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జనవరి 24, శనివారం మధ్యాహ్నం 2:00 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకు స్థానిక హిందూ దేవాలయం, సాంస్కృతిక కేంద్రంలో ఈ సంబరాలు జరగనున్నాయి.
కార్యక్రమ విశేషాలు: తెలుగు సంప్రదాయాలను, కళలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ వేడుకల్లో భాగంగా పలు పోటీలను నిర్వహిస్తున్నారు
ముగ్గుల పోటీలు: పెద్దల కోసం (ఒక టీమ్‌లో నలుగురికి అవకాశం) రంగోలి పోటీలు ఉంటాయి.
పిల్లల కోసం: ఆర్ట్ (Art), చెస్ (Chess) పోటీలను నిర్వహించనున్నారు.
ఈ వేడుకలకు ప్రవేశం ఉచితం, అయితే పోటీల్లో పాల్గొనే వారు మాత్రం $10 నామమాత్రపు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆసక్తి గల వారు ఆన్లైన్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని TAGKC కార్యవర్గ సభ్యులు తెలిపారు.






