Pattabhiram : తెలుగు రాష్ట్రాల మధ్య వైసీపీ, బీఆర్ఎస్ చిచ్చు : పట్టాభి
జగన్, కేసీఆర్ పత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కుట్రలకు తెరదీస్తున్నాయి అని ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (Kommareddy Pattabhiram) ధ్వజమెత్తారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాలు బాగుండాలని సీఎం చంద్రబాబు (CM Chandrababu) కోరుకుంటే, తెలుగు రాష్ట్రాలు సర్వనాశనం కావాలని వైసీపీ, బీఆర్ఎస్ కోరుకుంటున్నాయని మండిపడ్డారు. కేసీఆర్, జగన్ కలిసి ఉంటూనే తమ తమ పత్రికల ద్వారా తెలుగు ప్రజల నడుమ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఇతర ప్రాజెక్టులపై నమస్తే తెలంగాణ (Namaste Telangana), సాక్షి (Sakshi) పత్రికలు తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నాయి. తెలంగాణ నీటికి చంద్రబాబు అడ్డుపడుతున్నారంటూ నమస్తే తెలంగాణలో రాస్తే, చంద్రబాబు తెలంగాణకు న్యాయం చేస్తున్నారంటూ సాక్షి కథనాలు ప్రచురిస్తోంది. రాయలసీమ లిఫ్టును ఆపింది తామే అని హరీశ్‌రావు (Harish Rao) చెప్పినట్లు నమస్తే తెలంగాణలో రాస్తే, సీమ లిఫ్టును తానే ఆపించినట్లు రేవంత్‌రెడ్డి అన్నట్లు సాక్షిలో రాస్తారు. నీ రాష్ట్రంలో నీ డ్రామా నీవు ఆడు, నా రాష్ట్రంలో నా డ్రామా నేను ఆడుతా అంటూ జగన్, కేసీఆర్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు అని పేర్కొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






