TANTEX: టాంటెక్స్ రేడియో “గానసుధ”లో ద్వాదశ జ్యోతిర్లింగాల దివ్య వైభవం
డల్లాస్: ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (TANTEX) తన అధికారిక రేడియో విభాగం “గానసుధ” ద్వారా ప్రతి ఆదివారం విలక్షణమైన సాహిత్య, ఆధ్యాత్మిక కార్యక్రమాలను శ్రోతలకు అందిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఆదివారం, జనవరి 18, 2026 నాడు ఒక విశేష కార్యక్రమాన్ని ప్రసారం చేయనుంది.
అంశం: ‘ద్వాదశ జ్యోతిర్లింగాల దివ్య వైభవం’ (ఎపిసోడ్-1).
విశేషం: శివ పురాణాల ప్రకారం ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొట్టమొదటిదిగా వెలుగొందుతున్న సౌరాష్ట్ర సోమనాథ జ్యోతిర్లింగం విశిష్టతను ఈ ఎపిసోడ్లో వివరించనున్నారు. పునర్జన్మకు ప్రతీకగా పిలిచే ఈ శివక్షేత్రం ఆధ్యాత్మిక నేపథ్యాన్ని శ్రోతలకు కళ్ళకు కట్టినట్లు వివరిస్తారు. ఆర్జే ఈ కార్యక్రమాన్ని పరిమళ మార్పాక తనదైన శైలిలో నిర్వహిస్తారు. సాయంత్రం 5:00 నుండి 6:00 వరకు (CST) ఉంటుంది. వేదిక రేడియో ఆజాద్ (Radio Azad). శ్రోతలు www.radioazad.us వెబ్సైట్ ద్వారా లేదా వారి మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రపంచంలో ఎక్కడి నుండైనా వినవచ్చు. ఆధ్యాత్మిక చింతన కలిగిన వారు మరియు తెలుగు సంస్కృతిని ప్రేమించే వారు ఈ అద్భుత ప్రసారాన్ని తప్పక ఆలకించాలని తాంటెక్స్ కోరుతోంది.






