TATA: నార్త్ కరోలినాలో ఘనంగా టాటా సంక్రాంతి వేడుకలు
నార్త్ కరోలినాలోని ట్రయాంగిల్ ఏరియా తెలుగు అసోసియేషన్ (TATA) తమ 35 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలతో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. “పంటల సిరి, ఇంటి చిరునవ్వులు, భోగి మంటల వెచ్చదనం.. సంక్రాంతి అంటే మన సంస్కృతి సంబరం” అనే నినాదంతో ఈ వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ వేడుకల్లో భాగంగా జనవరి 17, 18వ తేదీల్లో టాటా కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు స్వీట్స్తోపాటు కొత్త సంవత్సర క్యాలెండర్లను పంపిణీ చేయనున్నారు.
మోరిస్విల్లే, క్యారీ, అపెక్స్, హోలీ స్ప్రింగ్స్, ఫుక్వే-వారినా, గార్నర్ వంటి వివిధ ప్రాంతాలలో ఈ పంపిణీ కార్యక్రమం జరగనుంది. వినోద్ కుమార్ కట్రగుంట (ప్రెసిడెంట్), నాగ గొంధి (వైస్ ప్రెసిడెంట్), వెంకట్ కోగంటి (సెక్రటరీ) లతో కూడిన 2026 బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆధ్వర్యంలో ఈ సంబరాలు నిర్వహిస్తున్నారు. స్థానిక వ్యాపార సంస్థలైన టార్క్ టెక్నాలజీస్, కాస్మోస్ గ్రానైట్ & మార్బుల్ వంటి పలువురు స్పాన్సర్లు ఈ కార్యక్రమానికి సహకారం అందిస్తున్నారు.






