Moon Moon Sen: సంచలనం.. మాజీ ప్రధానితో హీరోయిన్ ఎఫైర్?
సాధారణంగా చిత్ర పరిశ్రమలో వివాహం తర్వాత హీరోయిన్లకు అవకాశాలు తగ్గడం చూస్తుంటాం. అయితే పెళ్లై, ఇద్దరు బిడ్డలకు తల్లి అయిన తర్వాత కూడా భారతీయ సినిమా రంగంలో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న విలక్షణ నటి మూన్ మూన్ సేన్. లెజెండరీ బెంగాలీ నటి సుచిత్రా సేన్ కుమార్తెగా సినీ అరంగేట్రం చేసిన ఈమె, 30 ఏళ్ల వయస్సులో ‘అందర్ బహార్’ అనే బ్లాక్ బస్టర్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశారు.
మూన్ మూన్ సేన్ కేవలం వెండితెరకే పరిమితం కాకుండా రాజకీయాల్లోనూ తన సత్తా చాటారు. 2014లో తృణమూల్ కాంగ్రెస్ తరపున బంకురా నియోజకవర్గం నుండి ఎంపీగా విజయం సాధించారు. తెలుగులో నాగార్జున సరసన ‘మజ్ను’, అలాగే ‘సిరివెన్నెల’ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. ఆక్స్‌ఫర్డ్‌లో చదువుకున్న ఈమె, సినిమాల్లోకి రాకముందు ఇంగ్లీష్ టీచర్‌గా పని చేయడం విశేషం.

కెరీర్ పరంగా ఎంత విజయవంతమైనా, ఆమె వ్యక్తిగత జీవితం అనేక వివాదాలకు నిలయమైంది. ముఖ్యంగా పాకిస్థాన్ మాజీ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌తో ఆమెకు ప్రేమాయణం ఉందంటూ అప్పట్లో ప్రచారాలు జరిగాయి. అయితే ఈ రూమర్లపై ఆమె స్పందిస్తూ.. ఇమ్రాన్ తమ కుటుంబ స్నేహితుడని, అతనితో గడపడం తనకు సాంత్వననిస్తుందని, కానీ తమ మధ్య ఎలాంటి శారీరక సంబంధం లేదని స్పష్టం చేశారు. తన భర్త భరత్ దేవ్ వర్మ ప్రోత్సాహంతోనే తాను ఈ స్థాయికి చేరానని ఆమె గర్వంగా చెబుతుంటారు.






