Sharwanand: శర్వా చెప్పిన సంక్రాంతి సెంటిమెంట్
ఈ ఏడాది సంక్రాంతికి పలు సినిమాలు రిలీజవగా అందులో ప్రభాస్(prabhas) ది రాజా సాబ్(the Raja Saab) తప్పించి మిగిలిన సినిమాలన్నీ మంచి టాక్ ను తెచ్చుకుని హిట్ దిశగా దూసుకెళ్తున్నాయి. వాటిలో శర్వానంద్(Sharwanand) నటించిన నారీ నారీ నడుమ మురారి(nari nari naduma murari) కూడా ఒకటి. సామజవరగమన(Samajavaragamana) ఫేమ్ రామ్ అబ్బరాజు(Ram Abbaraju) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సంయుక్త మీనన్(Samyuktha Menon), సాక్షి వైద్య(Sakshi Vaidhya) హీరోయిన్లు గా నటించారు.
సినిమా హిట్టైన నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను నిర్వహించగా అందులో శర్వానంద్ ఓ కొత్త సెంటిమెంట్ ను రివీల్ చేశాడు. ఈ సినిమా హిట్టవుతుందని చెప్పి మరీ హిట్ కొట్టాను, సినిమాపై తన నమ్మకం నిజమవడంపై చాలా సంతోషంగా ఉందని చెప్పిన శర్వా, చాన్నాళ్లుగా పెద్ద హిట్ కోసం వెయిట్ చేస్తున్న తనకు ఈ మూవీ ఆ లోటును తీర్చిందని చెప్పాడు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఇక సెంటిమెంట్ విషయానికొస్తే తాను సంక్రాంతికి వచ్చిన ప్రతీసారీ అన్ని సినిమాలు ఆడతాయనని, అందుకే ఇకపై ప్రతీ సంక్రాంతికి తన కోసం ఓ స్లాట్ పక్కన పెట్టండని సరదాగా చెప్పుకొచ్చాడు. ఎక్స్ప్రెస్ రాజా(Express Raja) సినిమా సంక్రాంతికి వస్తే ఆ సినిమాతో పాటూ రిలీజైన మిగిలిన సినిమాలన్నీ కూడా ఆడాయని, తర్వాత శతమానం భవతి(Shathamanam Bhavathi)తో పాటూ వచ్చిన సినిమాలన్నీ కూడా సక్సెస్ అయ్యాయని, ఇప్పుడు నారీ నారీ నడుమ మురారి(Nari Nari Naduma murari)తో పాటూ రిలీజైన అన్నీ సినిమాలు కూడా హిట్టయ్యాయని, అందుకే శర్వా ఉంటే అన్నీ సినిమాలు ఆడతాయి కాబట్టి ప్రతీ సంక్రాంతికి తనకు ఓ స్లాట్ ను ఉంచమని రిక్వెస్ట్ చేశాడు శర్వా. టాలెంటెడ్ హీరో చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






