Secunderabad : ప్రజల దీవెనలతో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి : కేటీఆర్
సికింద్రాబాద్ కార్పొరేషన్ (Secunderabad Corporation) కోసం బీఆర్ఎస్ ర్యాలీకి సిద్ధమైంది. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ, మాజీ మంత్రి తలసాని (Talasani) ఆధ్వర్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్లోని మహాత్మాగాంధీ విగ్రహం (Mahatma Gandhi statue) వరకు భారీ శాంతి ర్యాలీకి నేతలు బయలుదేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ (KTR) మాట్లాడుతూ తమను పోలీసులు అడ్డుకున్నారని అన్నారు. జంట నగరాల అస్తిత్వం దెబ్బతీస్తే ఉపేక్షించం. ప్రజలకు నిరసన హక్కు లేకుండా చేశారు. ప్రజల దీవెనలతో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తుగ్లక్ పనులు చేస్తోంది అని అన్నారు.






