Surya46: భారీ రేటుకు సూర్య46 డిజిటల్ హక్కులు
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(suriya) వరుసపెట్టి సినిమాలైతే చేస్తున్నారు కానీ ఆయన కష్టానికి తగ్గ ఫలితం మాత్రం అందుకోలేకపోతున్నారు. కంగువ(Kanguva) సినిమాతో కోలీవుడ్ లోనే భారీ హిట్ అందుకుందామను కుంటే ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇక రెట్రో(Retro) సినిమా అయినా కలిసొస్తుందనుకుంటే ఆ సినిమాది కూడా అదే పరిస్థితి. దీంతో చేసేదేమీ లేక తర్వాతి సినిమాలపై ఫోకస్ చేశాడు సూర్య.
వరుస సినిమాలతో బిజీగా ఉన్న సూర్య, ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి(Venky Atluri) దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సూర్య కెరీర్లో 46వ సినిమాగా ఇది రూపొందుతుంది. ఈ సినిమాతో తమిళంతో పాటూ తెలుగులో కూడా భారీ సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు సూర్య. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ బిగ్ అప్డేట్ తెలుస్తోంది.
ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. దీని కోసం మేకర్స్ కు నెట్ఫ్లిక్స్ రూ.85 కోట్లను చెల్లించిందని సమాచారం. సూర్య ఫ్లాపుల్లో ఉన్నప్పటికీ ఓటీటీ రైట్స్ ఈ రేటుకు అమ్ముడవడం చూస్తుంటే సినిమాపై ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. మమిత బైజు(Mamitha Byju) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ (Sithara Entertainments) భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.






