Vijayasai Reddy: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులు
మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy)కి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఏపీ లిక్కర్ స్కామ్‌కు (Liquor scam) సంబంధించి ఈ నెల 22వ తేదీన ఈడీ (ED) ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులో విస్తృత స్థాయిలో విచారణ చేపట్టిన ఈడీ అధికారులు, ఇప్పుడు కీలక నేతలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.ఏపీ లిక్కర్ స్కామ్‌లో భారీగా అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. లిక్కర్ పాలసీ అమలు సమయంలో పెద్ద ఎత్తున హవాలా లావాదేవీలు, మనీ లాండరింగ్ జరిగాయని ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంలో పలువురు రాజకీయ నాయకులు (Political leaders), అధికారులు, ప్రైవేట్ వ్యక్తుల పాత్ర ఉందని ఈడీ అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. లిక్కర్ స్కామ్‌లో ఆయన పాత్రపై వివరణ ఇవ్వాలని ఈడీ కోరినట్లు సమాచారం.






