APSRTC: ఏపీఎస్ఆర్టీసీకి ప్రతిష్టాత్మక అవార్డు
ఏపీఎస్ఆర్టీసీ (APSRTC)కి ప్రతిష్టాత్మక గవర్నెన్స్ నౌ -6వ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సమ్మిట్ అవార్డు రావడం గర్వకారణమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (Mandipalli Ramprasad Reddy) అన్నారు. ఆర్టీసీ అధికారులు, సూపర్వైజర్లు, సిబ్బంది ప్రయాణికులకు అంకితభావంతో సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు.ఈ సందర్భంగా రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రయాణికులకు ముందుస్తు సమాచారం అందించడం ద్వారా సేవల నాణ్యత మరింత మెరుగుపడిరదన్నారు. డిజిటల్ సాంకేతికతను ప్రజాసేవకు వినియోగించిన ఆర్టీసి కృషికి జాతీయ స్థాయి గుర్తింపు వచ్చిందన్నారు. ప్రధాన బస్టాప్‌లలో ఆటోమేటిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ ( ఎఎఎస్) అమలు ప్రశంసనీయమన్నారు. అవార్డు సాధనలో కీలక పాత్ర పోషించిన ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు (Dwaraka Tirumala Rao)కు మంత్రి అభినంనదలు తెలిపారు. సాంకేతికతను అందిపుచ్చుకుని సీఎం చంద్రబాబు (CM Chandrababu) విజన్‌కు అనుగుణంగా ఆర్టీసి ముందడుగు వేస్తోందన్నారు. రాబోయే రోజుల్లో ప్రయాణికులకు మరింత ఆధునిక, సౌకర్యవంతమైన సేవలు అందిస్తామన్నారు.
2025 ఏడాదికి గాను ఏపీఎస్ఆర్టీసీ ఈ అవార్డుకు ఎంపికైంది. అన్ని ప్రధాన బస్ స్టేషన్లలో ఆటోమేటిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ ( ఎఎఎస్) ను ఏర్పాటు చేసి అమలు చేస్తున్నందుకు అవార్డు సాధించింది. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఢల్లీిలో అవార్డు తీసుకున్నారు.






