Chiranjeevi: హిట్ ఇచ్చిన డైరెక్టర్ కు మెగాస్టార్ బంపరాఫర్
మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) హీరోగా వచ్చిన తాజా సినిమా మన శంకరవరప్రసాద్ గారు(Mana Shankaravaraprasad Garu). సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తుంది. అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార(nayanthara) హీరోయిన్ గా నటించగా, విక్టరీ వెంకటేష్(Venkatesh) ఓ గెస్ట్ రోల్ చేసిన సంగతి తెలిసింద
మన శంకరవరప్రసాద్ గారు(MSG) సూపర్ హిట్ అయిన నేపథ్యంలో చిత్ర యూనిట్ రిలీజ్ తర్వాత కూడా ప్రమోషన్స్ ను చేస్తూనే ఉంది. అందులో భాగంగానే పండగ సందర్భంగా ఓ స్పెషల్ ఇంటర్వ్యూని ప్లాన్ చేయగా అందులో చిరూ, వెంకీ, అనిల్ పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో అనిల్ తో కలిసి త్వరలోనే మరో సినిమా చేయాలని, వెంకటేష్ తో కలిసి స్పెషల్ క్యారెక్టర్ లేదనా ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేయడానికైనా రెడీ అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.
చిరూ మాటలకు వెంకీ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అవడంతో ఈ కాంబోపై అందరికీ అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న వెంకీ, 2027 సంక్రాంతికి అనిల్ దర్శకత్వంలో మరో భారీ సినిమా చేయడానికి అవకాశాలు లేకపోలేదు. అది కూడా సంక్రాంతికి వస్తున్నాం(Sankranthi ki vasthunnam) మూవీకి సీక్వెల్ అయ్యే అవకాశాలున్నాయని టాక్. చిరూ, వెంకీ, అనిల్ కాంబినేషన్ లో ఫుల్ లెంగ్త్ సినిమా అంటే అనౌన్స్మెంట్ నుంచే ఆ సినిమాపై భారీ అంచనాలుండటం ఖాయం.






