Vijay Sethupathi: సేతుపతి నుంచి మరో ఇంట్రెస్టింగ్ మూవీ
దక్షిణాది లో ఉన్న ఉత్తమ నటుల్లో విజయ్ సేతుపతి(Vijay Sethupathi) ఒకరు. ముందు కోలీవుడ్ లో సినిమాలు చేసి మెప్పించిన సేతుపతి తర్వాత ఇతర భాషల్లో కూడా సినిమాలు చేసి వాటితో అందరినీ మెప్పించాడు. తెలుగులో ఉప్పెన లాంటి సినిమాల్లో విలన్ గా నటించి టాలీవుడ్ లోనూ మంచి ఫాలోయింగ్ ను ఏర్పరచుకున్న సేతుపతి ప్రస్తుతం పూరీ జగన్నాథ్(Puri Jagannadh) దర్శకత్వంలో స్లమ్ డాగ్(Slum Dog) అనే సినిమాను చేస్తున్నాడు.
రీసెంట్ గా సేతుపతి బర్త్ డే సందర్భంగా స్లమ్ డాగ్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా, దానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో పాటూ సేతుపతి నటిస్తున్న మరో సినిమా నుంచి కూడా అప్డేట్ వచ్చింది. అదే గాంధీ టాక్స్(Gandhi Talks) అనే సైలెంట్ మూవీ. సైలెంట్ మూవీ ఎరాను మళ్లీ వెనక్కి తీసుకొస్తున్నామని మేకర్స్ ఈ సందర్భంగా టీజర్ ద్వారా రివీల్ చేశారు.
గాంధీ టాక్స్ లో క్యారెక్టర్లు మాట్లాడకపోయినా డబ్బు మాట్లాడుతుంది. కిషోర్ పాండురంగ్ బెలేకర్(Kishore Pandurang Belekar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అరవింద్ స్వామి(Aravind Swami), అదితి రావు హైదరి(Aditi Rao Hydari) లాంటి ఇంట్రెస్టింగ్ క్యాస్టింగ్ కూడా నటించింది. జనవరి 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్(AR Rahman) సంగీతం అందిస్తుండగా, రాజేష్ కేజ్రీవాల్(Rajesh Kejriwal), మీరా చోప్రా(meera chopra) ఈ సినిమాను నిర్మిస్తున్నారు.






