Peddi: ఓటీటీ పార్టనర్‌ను ఫిక్స్ చేసుకున్న పెద్ది
గేమ్ ఛేంజర్(Game Changer) తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పెద్ది(Peddi). బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన(Buchi babu Sana) దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న పెద్ది మూవీపై అందరికీ మంచి అంచనాలున్నాయి. ఈ మూవీ కోసం చరణ్ చాలా కష్టపడుతున్నాడు.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను బుచ్చిబాబు నెక్ట్స్ లెవెల్ లో తెరకెక్కిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ పెద్ద అప్డేట్ తాజాగా బయటికొచ్చింది. అదే పెద్ది సినిమాకు సంబంధించిన ఓటీటీ డీల్. పెద్ది సినిమాను డిజిటల్ హక్కులను పాన్ ఇండియా భాషల్లో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్(Netfilx) సొంతం చేసుకుంది.
దీన్ని బట్టి పెద్ది సినిమా థియేటర్ రన్ తర్వాత నెట్‌ఫ్లిక్స్ లో పాన్ ఇండియా భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళంలో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఏఆర్ రెహమాన్(AR Rahman) సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో శివ రాజ్ కుమార్(Siva raj kumar) కీలక పాత్రలో నటిస్తుండగా, మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా పెద్ది ప్రేక్షకుల ముందుకు రానుంది.






