ఆకాశంలో ఒక తారకు దుల్కర్ చేయూత కరువు!
దుల్కర్ సల్మాన్(Dulquer Salman), సాత్విక వీరవల్లి(Satvika Veeravalli) జంటగా పవన్ సాదినేని(Pavan sadhineni) దర్శకత్వంలో తెరకెక్కిన ఆకాశంలో ఒక తార(Aakasamlo oka tara) ఆడియన్స్ నుంచి విశేష ఆదరణ పొందుతోంది. విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ, ఆ స్థాయిలో బాక్సాఫీస్ కలెక్షన్లు నమోదు కాకపోవడం గమనార్హం. ఫస్ట్ వీకెండ్ లో ఓ మోస్తరు కలెక్షన్లను సాధించిన ఈ సినిమాకు మరింత విస్తృత ప్రచారం అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రిలీజ్ టైమ్ లో మూవీ హీరో హీరోయిన్ అమెరికాలో ప్రీమియర్ షోలు, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్స్‌పై ప్రభావం పడింది.
ఇవి కూడా చదవండి
ఫస్ట్ వీకెండ్ తర్వాత హైదరాబాద్‌కు తిరిగొచ్చిన సాత్విక వీరవల్లి థియేటర్లను సందర్శిస్తూ ఆడియన్స్ తో మమేకమవుతోంది. అయితే దుల్కర్ సల్మాన్ తెలుగు రాష్ట్రాల్లో ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. తెలుగులో వరుస సక్సెస్‌లతో ప్రత్యేక అభిమానగణాన్ని సంపాదించుకున్న దుల్కర్ స్వయంగా రంగంలోకి దిగితే సినిమా కలెక్షన్లు మరింత పుంజుకునే అవకాశం ఉందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
మరోవైపు ఫస్ట్ వీక్ కంటే సెకండ్ వీక్ లో ఈ సినిమా మెరుగైన కలెక్షన్లు సాధిస్తుందని నిర్మాత అల్లు అరవింద్ ఆశాభావం వ్యక్తం చేశారు. పాజిటివ్ మౌత్‌టాక్ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తోంది. దుల్కర్ తన బిజీ షెడ్యూల్లో కొంత టైమ్ ను ఈ చిత్ర ప్రచారానికి కేటాయించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరి సెకండ్ వీకెండ్ లో ప్రేక్షకాదరణ ఏ మేరకు పెరుగుతుందో చూడాలి.







