Dragon: డ్రాగన్ రిలీజప్పుడేనా?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లలో ప్రశాంత్ నీల్(Prasanth Neel) దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్(Dragon) సినిమా స్పెషల్ గా నిలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా కొనసాగుతోంది. అయితే ప్రారంభంలో మేకర్స్ ప్లాన్ చేసిన టైమ్‌లైన్ ప్రకారం సినిమా రిలీజ్ కావడం కష్టమనే సంకేతాలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
మొదట ఈ సినిమాను ఈ ఇయర్ లోనే రిలీజ్ చేయాలని భావించినప్పటికీ, ప్రొడక్షన్ పనులు మరియు భారీ స్థాయి నిర్మాణం కారణంగా ఆ ప్లాన్ మారినట్లు తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించిన రిలీజ్ డేట్ ఉన్నప్పటికీ, ఆ తేదీకి సినిమా విడుదలయ్యే అవకాశం తక్కువగా ఉందని సమాచారం. దీంతో మేకర్స్ సినిమా రిలీజ్ ను వచ్చే ఏడాదికి మార్చాలని నిర్ణయించినట్టు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను 2027 మార్చి 7న రిలీజ్ చేయాలనే ప్లాన్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా గురించి అధికారిక స్పష్టత త్వరలోనే రానుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ నుంచి ఏదైనా అప్డేట్ వచ్చే అవకాశం ఉందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రవి బస్రూర్(Ravi Basrur) సంగీతం అందిస్తుండగా.. ఎన్టీఆర్ ఆర్ట్స్(NTR Arts), మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌తో ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మరో బ్లాక్‌బస్టర్‌ను అందిస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.








