Priyadarshan: విడాకుల తర్వాత మాజీ భార్యతో కలిసి ఉంటున్న డైరెక్టర్
విడాకుల తర్వాత పదేళ్లకు ప్రముఖ డైరెక్టర్ ప్రియదర్శన్(priyadarshan), అతని మాజీ భార్య లిస్సీ లక్ష్మి(Lissy lakshmi) మళ్లీ కలిసి ప్రారంభించడం సినీ ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. 2016లో అధికారికంగా విడిపోయిన ఈ జంట, ఇప్పుడు మళ్లీ ఒక్కటిగా జీవించాలనే నిర్ణయం తీసుకోవడం వారి రిలేషన్‌కి కొత్త దిశగా భావించబడుతోంది. పెళ్లి అనే అధికారిక బంధం లేకపోయినా, పరస్పర అవగాహనతో ముందుకు సాగాలని వారు నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి
ఈ రీయూనియన్‌లో వారి కుటుంబం కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వారి కూతురు కళ్యాణి ప్రియదర్శన్(kalyani priyadarshan) తో పాటూ కొడుకు సిద్ధార్థ్(Siddarth) తల్లిదండ్రులు మళ్లీ దగ్గర కావాలని చేసిన ప్రయత్నాలు ఈ నిర్ణయానికి దారితీశాయని కుటుంబానికి దగ్గరైన వారు చెబుతున్నారు. 1990లో పెళ్లి చేసుకున్న ఈ జంట దశాబ్దాల పాటు కలిసి జీవించినప్పటికీ, వ్యక్తిగత విభేదాలు మరియు ఈగో క్లాషెస్ కారణంగా 2014లో విడాకుల ప్రక్రియ ప్రారంభమై, 2016లో విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో ఇలా విడిపోవడం చాలా ఎమోషనల్ గా, కఠినంగా అనిపించిందని లిస్సీ లక్ష్మి వెల్లడించిన విషయం తెలిసిందే.
కాలక్రమేణా వారి మధ్య దూరం తగ్గుతూ రావడంతో, సుమారు ఆరు నుండి ఎనిమిది నెలల క్రితం మళ్లీ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే తిరిగి పెళ్లి చేసుకోవాలనే ఆలోచన మాత్రం ఈ జంటకు లేదని తెలుస్తోంది. మ్యారేజ్ సర్టిఫికేట్ తప్ప మేము మళ్లీ అదే జీవితం గడుపుతున్నామని ప్రియదర్శన్ వ్యాఖ్యానించడం వారి దృక్పథాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది.
ఇవి కూడా చదవండి








