టాలీవుడ్లోకి మలయాళ హిట్ సినిమాల డైరెక్టర్
కోలీవుడ్ లో వరుస సక్సెస్‌లతో సత్తా చాటుతున్న యంగ్ డైరెక్టర్ జీతూ మాధవన్(Jeethu Madhavan) ఇప్పుడు టాలీవుడ్‌పై దృష్టి సారించారు. రోమాంచం(Romancham), ఆవేశం(Aavesham), సీన్(Scene) సినిమాలతో హ్యాట్రిక్ సక్సెస్‌లను అందుకున్న ఆయన త్వరలోనే నేరుగా తెలుగు సినిమా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. రీసెంట్ గా రిలీజైన సీన్ బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్‌ను అందుకోవడంతో పాటు నిర్మాతగా హీరో సూర్యకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. దీంతో జీతూ మాధవన్ నెక్ట్స్ ప్రాజెక్టుపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్(Mythi movie makers) ఈ మలయాళ డైరెక్టర్ తో సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయనకు భారీ మొత్తంలో అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమాలో హీరోగా ఎవరు నటిస్తారనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. పలువురు తెలుగు హీరోలతో నిర్మాణ సంస్థ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి
ప్రస్తుతం జీతూ మాధవన్ రెండు కథలను రెడీ చేసే పనిలో ఉన్నారట. విభిన్న కథాంశాలు, ఆసక్తికరమైన కథనంతో ఆడియన్స్ ను ఆకట్టుకోవడంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ డైరెక్టర్ తెలుగు ఆడియన్స్ కోసం ఎలాంటి కథను ఎంచుకుంటారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఆయన దర్శకత్వ శైలికి టాలీవుడ్ స్టార్ హీరో తోడైతే ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఏర్పడే అవకాశముంది. హీరో సెలెక్షన్ పూర్తైన తర్వాత సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వెలువడే అవకాశం ఉంది.







