ఈఎన్ఈ రిపీట్‌లో డైరెక్టర్ అనిల్ రావిపూడి స్పెషల్ క్యామియో!
టాలీవుడ్లో వరుస సక్సెస్‌లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి(anil ravipudi) ఇప్పుడు నటుడిగానూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలు టీవీ షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఆయన, గతంలో పలుమార్లు యాక్టింగ్ పై తన ఆసక్తిని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో విశ్వక్ సేన్(viswaksen) హీరోగా నటిస్తున్న ఈఎన్ఈ రిపీట్(ENE Repeat) సినిమాలో అనిల్ రావిపూడి స్పెషల్ రోల్ లో కనిపించనుండటం ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాకు తరుణ్ భాస్కర్(tharun bhaskar) దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాలో విశ్వక్ సేన్ ఓ ఫిల్మ్ మేకర్ పాత్రలో కనిపించనుండగా, అనిల్ రావిపూడి కూడా డైరెక్టర్ పాత్రలోనే సందడి చేయనున్నారు. సినిమాలో రెండు కీలక సీన్స్ లో ఆయన కనిపిస్తారని సమాచారం. అనిల్ రావిపూడి కామెడీ టైమింగ్, ఆయనకున్న క్రేజ్ దృష్ట్యా ఈ స్పెషల్ క్యారెక్టర్ సినిమాకు అడిషనల్ ఎట్రాక్షన్ గా నిలవనుంది. అభినవ్ గోమఠం(Abhinav gomatam), అనీషా అంబ్రోస్(Aneesha ambrose), శివాత్మిక రాజశేఖర్(Sivatmika rajasekhar), వెంకటేశ్ కాకుమాను(Venkatesh kakumanu), శ్రీనాథ్ మాగంటి(Srinath Maganti) ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
వివేక్ సాగర్(Vivek sagar) ఈ సినిమాకు సంగీతం, నేపథ్య సంగీతం అందిస్తున్నారు. రూట్ నోడ్ సినిమా (Routenode cinema), ఎస్ ఒరిజినల్స్(S Originals), సురేష్ ప్రొడక్షన్స్(Suresh prodcutions) సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నగరానికి ఏమైంది(ee nagaranika emaindhi) సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్ ఇద్దరికీ కీలకంగా మారింది. మరి ఈసారి బాయ్స్ గ్యాంగ్ ఎలాంటి వినోదాన్ని అందిస్తుందో చూడాలి.







