Dacoit: షూటింగ్ పూర్తి చేసుకున్న డెకాయిట్
అడివి శేష్(adivi sesh) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా డెకాయిట్(Dacoit) ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను సృష్టించింది. షానియెల్ డియో(shaniel deo) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా స్టైలిష్ యాక్షన్ డ్రామాగా రూపొందుతుంది. డెకాయిట్ నుంచి ఇప్పటివరకు రిలీజైన పోస్టర్లు, టీజర్ లాంటి ప్రమోషనల్ కంటెంట్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్‌ను అందుకుంది. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ను చిత్ర యూనిట్ ప్రకటించింది. డెకాయిట్ షూటింగ్ పూర్తి అయిందని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నట్టు మేకర్స్ తెలిపారు.
ఇవి కూడా చదవండి

ఇక షూటింగ్ పూర్తికావడంతో సినిమా ప్రమోషన్స్‌ను కూడా త్వరలోనే ప్రారంభించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఈ మూవీలో అడివి శేష్ మరోసారి తన స్పెషల్ యాక్టింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడని చిత్ర యూనిట్ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. కథలో యాక్షన్‌తో పాటు ఎమోషన్ కూడా సమంగా ఉండేలా డైరెక్టర్ ఈ సినిమాను రూపొందించినట్లు సమాచారం. దీంతో ఈ సినిమా యాక్షన్ డ్రామా అభిమానులను బాగా అలరించే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ సినిమాలో అందాల నటి మృణాల్ ఠాకూర్(Mrunal thakur) హీరోయిన్గా నటిస్తుండగా, బాలీవుడ్ డైరెక్టర్- యాక్టర్ అనురాగ్ కశ్యప్(Anurag kashyap) కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే ప్రకాష్ రాజ్(prakash raj), సునీల్(Suneel) లాంటి ప్రముఖ నటులు కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమాను సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో డెకాయిట్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇవి కూడా చదవండి








