Peddi: పెద్ది రన్ టైమ్ విషయంలో క్లారిటీ
ఇటీవల కాలంలో భారీ నిడివి ఉన్న సినిమాలు థియేటర్లలో విడుదలవడం సాధారణంగా మారింది. కథనం బలంగా ఉంటే రన్‌టైమ్ ఎంతైనా ప్రేక్షకులు ఆదరిస్తారనే భావనకు ఉదాహరణగా నిలిచింది పుష్ప2(pushpa2) సినిమా. దాదాపు 3.40 గంటల రన్ టైమ్ తో రిలీజైన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మంచి వసూళ్లు సాధించి రికార్డులు సృష్టించింది. కంటెంట్ మెప్పిస్తే రన్ టైమ్ అడ్డు కాదని ఈ మూవీ మరోసారి ప్రూవ్ చేసింది. దీంతో ఇప్పుడు పెద్ద సినిమాల విషయంలో రన్‌టైమ్ పై చర్చలు మరింత పెరిగాయి.
ఈ నేపథ్యంలో డైరెక్టర్ బుచ్చిబాబు సానా(buchi babu sana), మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(ram charan) కాంబినేషన్లో రూపొందుతున్న పెద్ది(peddi) సినిమాపై కూడా ఇలాంటి రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు నాలుగు గంటలకు పైగా ఫుటేజ్ వచ్చిందని, రఫ్ కట్ చేసినా మూడు గంటలకు పైగా నిడివి ఉంటుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ ప్రచారాల్లో ఎలాంటి నిజం లేదని చిత్ర యూనిట్‌కు చెందిన పీఆర్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం సినిమా ఎడిటింగ్ పనులు జరుగుతున్నాయని, తుది నిడివిపై ఇంకా అధికారిక నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు.
కాబట్టి పెద్ది సినిమా విషయంలో వస్తున్న మూడు గంటలకు పైగా రన్‌టైమ్ వార్తలను అభిమానులు నమ్మాల్సిన అవసరం లేదని సమాచారం. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్(Janhvi kapoor) హీరోయిన్గా నటిస్తుండగా, వృద్ధి సినిమాస్(Vriddhi cinemas) బ్యానర్‌పై ఈ భారీ ప్రాజెక్ట్ రూపొందుతోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కథ, కంటెంట్, నిర్మాణ విలువల విషయంలో ఎలాంటి రాజీ లేకుండా మేకర్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి








