BMW: భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓటీటీ రిలీజ్ పై అప్డేట్
రిజల్ట్ తో సంబంధం లేకుండా మాస్ మహారాజా రవితేజ(raviteja) వరుస పెట్టి సినిమాలను చేస్తుంటాడనే సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని సినిమాలుగా రవితేజ చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్న రీతిలో పెర్ఫార్మ్ చేయడం లేదు. ధమాకా(dhamaka) తర్వాత మాస్ మహారాజాకు చెప్పుకోదగ్గ హిట్ పడలేదు. కాగా రవితేజ రీసెంట్ గా సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి(bhartha mahasayulaki wignyapthi) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.
జనవరి 13న రిలీజ్ అయిన ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహించాడు. కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మిక్డ్స్ రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద మిక్డ్స్ టాక్ తో అలరించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా థియేట్రికల్ రన్ ముగించుకుని ఇప్పుడు ఓటీటీలో ఆడియన్స్ ను అలరించడానికి రెడీ అవుతుంది.
ప్రముఖ ఓటీటీల సంస్థ జీ5లో ఈ మూవీ వాలెంటైన్స్ డే కానుకగా ఫిబవ్రరి 13న స్ట్రీమింగ్ కానున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే వీలుంది. థియేటర్లలో మిక్డ్స్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా మరి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ ను తెచ్చుకుంటుందో చూడాలి. ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయాతి(dimple hayathi), ఆషిక రంగనాథ్(Ashika Ranganath) హీరోయిన్లుగా నటించారు.






