సూర్య 50వ సినిమాకు అరుణ్ మాథేశ్వరన్?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(suriya) తన కెరీర్లో ప్రిస్టీజియస్ 50వ సినిమాను స్పెషల్ గా మలచుకునేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు విభిన్న కథాంశాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ అరుణ్ మాథేశ్వరన్(arun matheswaran) దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయని కోలీవుడ్ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది. ఇప్పటికే రాకీ(rockey), సాని కాయిదమ్(Saani kayidham), కెప్టెన్ మిల్లర్(captain miller) వంటి సినిమాలతో తనదైన మేకింగ్ శైలిని పరిచయం చేసిన అరుణ్.. ఇటీవల లోకేష్ కనగరాజ్(lokesh kanagaraj), వామికా గబ్బి(wamiqa gabbi) ప్రధాన పాత్రల్లో నటించిన డీసీ(DC) సినిమాను రూపొందించారు. ప్రస్తుతం సూర్య 50వ సినిమా కోసం వీరిద్దరి మధ్య డిస్కషన్స్ జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఈ కాంబినేషన్‌పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.
ప్రస్తుతం సూర్య వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. జీతూ మాధవన్(Jeethu madhavan) దర్శకత్వంలో తెరకెక్కిన సీన్(Scene) నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. నజ్రియా(Nazriya), నస్లెన్(naslen) కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా యాక్షన్ కామెడీగా రూపొందింది. మరోవైపు టీజే జ్ఞానవేల్(TJ Gnanavel) దర్శకత్వంలో తన 48వ సినిమాను హోంబలే ఫిలింస్(Hombale films) నిర్మాణంలో చేస్తున్నారు. ఇందులో కయాదు లోహర్(kayadhu lohar), యోగిబాబు(Yogibabu) నటిస్తున్నారు. అలాగే మతిమారన్ పుగళేంధి(Mathipuran Pugalendhi) దర్శకత్వంలో తన 49వ సినిమా చేసేందుకు సూర్య డిస్కషన్స్ జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మండాడి డైరెక్టర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా తీరప్రాంత నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా అని, కలైపులి ఎస్. థాను(Kaliapuli S. Thanu) నిర్మించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఈ మూడు ప్రాజెక్టుల విషయంలో క్లారిటీ వచ్చిన తర్వాత సూర్య తన 50వ సినిమాపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. అరుణ్ మాథేశ్వరన్‌తో డిస్కషన్స్ ఫలిస్తే మాత్రం తమిళ సినీ పరిశ్రమలో మరో ఇంట్రెస్టింగ్ ప్రయోగాత్మక కాంబినేషన్ తెరపైకి వచ్చినట్లే.







