CBN: శిరీష్ దంపతులను ఆశీర్వదించిన సీఎం చంద్రబాబు
హైదరాబాద్లో ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ నివాసానికి వెళ్లి నవ దంపతులు శిరీష్, నయనికలను ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వదించారు. ఇటీవల అల్లు అరవింద్ కుమారుడు శిరీష్ వివాహమైంది. అయితే ఆ సమయంలో వివిధ పనులో బిజీగా ఉన్న అంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఈ వేడుకకు హజరు కాలేక పోయారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం అల్లు అరవింద్ ఇంటికి స్వయంగా వెళ్లి నూతన వధూవరులను అశీర్వదించారు. పూల బోకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అల్లు ఫ్యామిలీ సీఎం చంద్రబాబు నాయుడుకి శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రతిమను బహూకరించారు.









