Raaka: బన్నీ డెడికేషన్ ను హ్యాట్సాఫ్ అనాల్సిందే
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu arjun) పుష్ప(Pushpa) ఫ్రాంచైజ్ తర్వాత చేస్తున్న భారీ ప్రాజెక్ట్ రాకా(Raaka)పై టాలీవుడ్లో ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై ఏడాది గడిచినా, ఇప్పటివరకు సగం మేర మాత్రమే పూర్తయినట్టు సమాచారం. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్(Sun pictures) నిర్మిస్తోంది. తాజా అప్డేట్స్ ప్రకారం ఈ సినిమా డిసెంబర్ 2027లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో సంచలనం సృష్టించగా, అందులో అల్లు అర్జున్ లుక్‌పై విస్తృత చర్చ మొదలైంది. ఈ సినిమాలో ఆయన పూర్తిగా కొత్త గెటప్‌లో కనిపించనున్నారని, అందుకోసం షూటింగ్‌కు ముందు అనేక లుక్ టెస్టులు నిర్వహించినట్టు సమాచారం. మరింత ఆసక్తికర విషయం ఏమిటంటే, ఈ సినిమాలో ఆయన ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో కనిపించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రతి రోజు 3-4 గంటల పాటు మేకప్‌కు సమయం కేటాయిస్తూ, తన పాత్రను పర్ఫెక్ట్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ భారీ ప్రాజెక్ట్‌లో దీపికా పదుకొణె(deepika padukone), మృణాల్ ఠాకూర్(mrunal thakur), జాన్వీ కపూర్(Janhvi kapoor), రష్మిక మందన్నా(Rashmika mandanna) కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమా ద్వారా అట్లీ- అల్లు అర్జున్ కాంబినేషన్ ఇండియన్ సినీ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని అందించనుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. రాకా టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా స్థాయిలో భారీ ప్రభావం చూపే ప్రాజెక్ట్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.








