అందరి చూపు దానిపైనే
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా, డైరెక్టర్ బుచ్చిబాబు సాన(Buchi Babu Sana) తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా సినిమా పెద్ది(Peddi) రిలీజ్ కు టైమ్ దగ్గరపడుతున్న కొద్దీ అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరుగుతోంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమా కేవలం క్రీడల చుట్టూ తిరిగే కథ మాత్రమే కాకుండా, బలమైన భావోద్వేగాలతో కూడిన కథనంగా ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర బృందం ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. సినిమా ప్రమోషన్స్ వేగం పుంజుకుంటున్న ఈ సమయంలో ప్రేక్షకుల దృష్టి ఇప్పుడు రిలీజ్ ట్రైలర్‌పై నిలిచింది.
సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కు మిక్డ్స్ రెస్పాన్స్ లభించిన సంగతి తెలిసిందే. విజువల్స్, రామ్ చరణ్ మేకోవర్ ప్రశంసలు అందుకున్నప్పటికీ, కథలోని అసలు ఎమోషన్స్ ను మరింత బలంగా చూపించే మరో ట్రైలర్ వస్తే బాగుంటుందని అభిమానులు సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రత్యేకంగా రిలీజ్ ట్రైలర్‌ను సిద్ధం చేస్తున్నారనే ప్రచారం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.
అయితే తాజా సమాచారం ప్రకారం, ఒకవేళ రిలీజ్ ట్రైలర్ రిలీజ్ చేయాలనే నిర్ణయం తీసుకుంటే అది గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగానే వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. దీంతో రేపు జరగనున్న వేడుకపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. మరోవైపు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్(A. R. Rahman) స్వరాలు అందిస్తున్న ఈ సినిమాను వృద్ధి సినిమాస్(Vriddhi Cinemas) నిర్మిస్తోంది. భారీ అంచనాల మధ్య పెద్ది జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ముందే ఏర్పడుతున్న హైప్‌ను చూస్తుంటే, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బలమైన ఓపెనింగ్స్ నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.







