Lenin: 50 ఏళ్ల వయస్కుడిగా అఖిల్?
అక్కినేని యంగ్ హీరో అఖిల్(akhil) ఎంత కష్టపడినా అదంతా బూడిదలో పోసిన పన్నీరు మాదిరే తయారవుతుంది. ఎప్పటికప్పుడు ఈ సినిమా అయినా మంచి సక్సెస్ ను ఇస్తుందనుకోవడమే తప్పించి, అఖిల్ ఖాతాలో ఇప్పటివరకు సాలిడ్ హిట్ ఒక్కటీ లేదు. ఏజెంట్(Agent) సినిమా అయినా సక్సెస్ అవుతుందనుకుంటే అది టాలీవుడ్ లోని అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది.
దీంతో అఖిల్ చాలా నిరాశ పడ్డాడు. ఆ నిరాశ నుంచి తేరుకుని కాస్త గ్యాప్ తీసుకున్న అఖిల్, ఇప్పుడు మురళీ కిషోర్ అబ్బూరి(murali kishore abburi) దర్శకత్వంలో లెనిన్(lenin) అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భాగ్యశ్రీ బోర్సే(bhagya sri borse) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది. అఖిల్ లెనిన్ మూవీ లో ఓల్డ్ లుక్ లో కనిపించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఓ యాక్షన్ ఎపిసోడ్ లో అఖిల్ 50 ఏళ్ల వ్యక్తిగా కనిపిస్తాడని, మూవీలో ఈ లుక్ కొన్ని నిమిషాల పాటూ ఉంటుందని అంటున్నారు. మరి అఖిల్ ఈ లుక్ లో ఎలా కనిపించనున్నాడనేది ఆసక్తికరంగా మారింది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అఖిల్ భారీ అంచనాలే పెట్టుకున్నాడు. మరి ఈ సినిమాతో అయిఇఆ అఖిల్ హిట్ కొడతాడో లేదో చూడాలి.






