ఉక్రెయిన్‌కు మద్దతుగా మా సైన్యాన్ని పంపం
ఉక్రెయిన్‌కు మద్దతుగా తమ సైనికులను పంపబోమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. అమెరికన్ కాంగ్రెస్ నుద్దేశించి బైడెన్ మాట్లాడుతూ రష్యా సైన్యంతో పోరాడేందుకు ఒక్క సైనికుడు కూడా వెళ్లడని అన్నారు. పోలండ్, రుమేనియా, లాత్వియా, లిథుయేనియా, ఎస్తోనియాల్లో అమెరికా సైన్యాన్ని బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. రష్యా అక్కడితో ఆగకుండా, నాటో మిత్రపక్షాలపై దాడికి దిగితే వారికి సాయంగా తమ బలగాలు వస్తాయని తెలిపారు. ఉక్రెయిన్ సంక్షోభం పట్ల అమెరికన్ల భయాందోళనలను చెల్లాచెదురు చేయడానికి బైడెన్ ప్రయత్నించారు.






