అమెరికాలో మొదలైన నూతన విధానం… వద్దనుకునే సేవలకు
తమకు అక్కర్లేని సభ్యత్వాలను, పదేపదే చెల్లింపులు కోరే సర్వీసులను తోసిపుచ్చడం అమెరికన్లకు ఇక సులవు కానుంది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే కాలమే ధనం కార్యక్రమం కింద అమెరికన్లు, అవాంఛనీయ సభ్యత్వాలకు, పునరావృతమయ్యే చెల్లింపు సర్వీసులకు ఆన్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి టాటా చెప్పగలుగుతారు. వినియోగదారుల హక్కుల రక్షణ కోసమే ఈ చర్య తీసుకున్నామని శ్వేతసౌధం దేశీయ వ్యవహారాల విధాన సలహాదారు నీరా టాండాన్ మీడియాకు తెలిపారు. క్లిక్ చేసిన ఒక సర్వీసుకు చందా (సబ్స్క్రైబ్) కట్టడం ఎంత సులువో, అంతే సులువుగా క్లిక్ చేసి చందాను రద్దు చేసుకునే సౌలభ్యం కల్పించాలని నిరుడు మార్చి నుంచి అమెరికా ఫెడరల్ వాణిజ్య కమిషన్ క్లిక్ టు క్యాన్సిల్ నిబంధన ప్రవేశపెట్టింది.






