Alcatraz prison: డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. మళ్లీ ఆ జైలు ఓపెన్!

అమెరికాలోనే అత్యంత కఠినమైన, 60 ఏళ్ల కిందట మూతపడిన అల్కాట్రాజ్ జైలు (Alcatraz prison)ను తెరవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump )నిర్ణయించారు. కాలిఫోర్నియా (California) లోని ద్వీపంలో ఉండే ఈ జైలును తెరవాలని అధికారులకు ఆదేశాలిచ్చామని ఆయన వెల్లడిరచారు. ఈ జైలు నుంచి అమెరికా ప్రధాన భూభాగంలోకి రావడం అత్యంత కష్టం. చాలాకాలంగా అమెరికా దుర్మార్గమైన, హింసాత్మకమైన తరచు నేరాలు చేసే వారివల్ల ఇబ్బందులు పడుతోంది. వారు దేశానికి ఎటువంటి సేవలు అందించకపోగా బాధపెడుతున్నారు. గతంలో ఇటువంటి అత్యంత ప్రమాకరమైన నేరగాళ్లను అత్యంత దూరంగా ఉండే జైళ్లలో ఉంచాం.ప్రజలకు ఎటువంటి హాని చేయలేనంత దూరంలో వారిని పెట్టాం. అటువంటి కఠిన శిక్షలను మళ్లీ తేవాల్సిన అవసరం ఉంది. అందుకే మళ్లీ ఆ జైలును పునర్నిర్మించి తెరవాలని జైళ్లశాఖ, న్యాయశాఖ(, Justice Department) , ఎఫ్‌బీఐ, హోంలాండ్ భద్రతా విభాగాలను ఆదేశించాం అని ట్రంప్ పేర్కొన్నారు.
బలమైన సముద్ర అలలతోపాటు అత్యంత చల్లని పసిఫిక్ నీటితో నిండి ఉండే అల్కాట్రాజ్ జైలు ఖైదీలకు నరకం లాంటిది. ద రాక్ అని పిలిచే ఈ జైలులో గ్యాంగ్‌స్టర్ అల్ కాపోన్ (Gangster Al Capone), జార్జ్ మెషీన్ గన్ కెల్లీ లాంటి కరుడుగట్టిన నేరగాళ్లను ఉంచారు. దీనిపై సినిమాలూ నిర్మితమయ్యాయి. 29 ఏళ్లపాటు మనుగడలో ఉన్న ఈ జైలు నుంచి తప్పించుకోవడానికి 36 మంది 14 సార్లు ప్రయత్నించారు. వారందరూ దొరికిపోయారు. అధిక నిర్వహణ ఖర్చుల కారణంగా 1963లో ఈ జైలును మూసివేశారు. ప్రస్తుతం అల్కాట్రాజ్ ద్వీపాన్ని పర్యాటక (Tourist) కేంద్రంగా మార్చారు.