మళ్లీ డొనాల్డ్ ట్రంప్ దే గెలుపు
అమెరికాలో ఇప్పటికిప్పుడు అధ్యక్ష ఎన్నికలు జరిగితే మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత 77 ఏళ్ల డొనాల్డ్ ట్రంప్ మళ్లీ గెలుస్తారని తాజా సర్వేలో తేలింది. ట్రంప్‌కు 52 వోట్లు పోల్ అయ్యే ఛాన్స్ ఉందని వెల్లడైంది. 45 నుంచి 40 శాతం ఓట్ల తేడాతో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ను ట్రంప్ ఓడిస్తారని సర్వేలో గుర్తించారు. హార్వర్డ్ హారిస్ పోల్ సంస్థ ఈ నెల 19, 20 తేదీలలో 2,068 మంది ఓటర్లను సర్వే చేసి ఈ అంచనా ఫలితాలను విడుదల చేసింది. ఈ సర్వేలో ప్రస్తుతం అమెరికా వైఎస్ ప్రెసిడెంట్‌గా ఉన్న కమలా హారిస్ కంటే ట్రంప్‌కు 47 శాతం ఎక్కువ ఓట్లు వచ్చాయి. సర్వేలో పాల్గొన్న 16 శాం ఓటర్లు ఓటు ట్రంప్‌కు వేయాలా? బైడెన్‌కు వేయాలా? అనేది ఇంకా డిసైడ్ చేసుకోలేదని తెలిపారు.






