Secret Service : సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌గా 13 ఏళ్ల బాలుడు

అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా డొనాల్డ్ ట్రంప్ నిర్వహించిన కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. యూఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ (Secret Service Agent ) గా డీజే డేనియల్ (DJ Daniel) అనే 13 ఏళ్ల బాలుడిని నియమించి ట్రంప్ అందర్నీ ఆశ్చర్యపర్చారు. టెక్సాస్ (Texas)కు చెందిన డేనియల్ వివరాలను ఆయన ఈ సందర్భంగా పంచుకున్నారు. 2018లో ఆ బాలుడు అరుదైన క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డారు. ఐదు నెలలే బతుకుతాడని అప్పట్లో వైద్యులు తేల్చారు. కానీ డేనియల్ కుంగిపోలేదు. వ్యాధితో ధైర్యంగా పోరాడాడు. పోలీసు అధికారి కావాలన్న అతడి కలను వదులుకోలేదు. అందుకే ఇప్పుడు మేం అతడికి గొప్ప గౌరవం ఇవ్వబోతున్నాం. యూఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌గా ఆ బాలుడిని తీసుకోవాలని సంస్థ డైరెక్టర్ సీన్ కరన్‌ను కోరుతున్నా అని ట్రంప్ వెల్లడిరచారు.