జో బైడెన్ కు కంగ్రాట్స్ చెప్పిన పుతిన్…
అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే ఎలక్టోరల్ కాలేజీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. అమెరికా అధ్యక్షుడిగా కొత్తగా ఎన్నికైన బైడెన్‌కు కంగ్రాట్స్ చెప్పారు. నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో బైడెన్‌కు 306 ఎలక్టోరల్ ఓట్లు పోల్వవగా.. ట్రంప్‌కు 232 ఓట్లు పోలయ్యాయి. బైడెన్ విక్టరీని ఎలక్టోరల్ కాలేజీ ధ్రువీకరించింది. ఈ నేపథ్యంలో బైడెన్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వచ్చే నెల 20వ తేదీని అమెరికా 46వ దేశాధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణ స్వీకారం చేస్తారు.






