అధ్యక్ష అభ్యర్థిత్వానికి నిక్కీ హేలీ ప్రచారం షురూ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, హారిస్ ద్వేషం దేశాన్ని చుట్టుముట్టిందని రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ చేస్తున్న నిక్కీ హేలీ వ్యాఖ్యానించారు. రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ఆమె అధికారికంగా ప్రచారాన్ని ప్రారంభించారు. బలమైన అమెరికా, గర్వించదగ్గ అమెరికా కోసం అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నాను. అగ్రరాజ్యం అప్రమత్తంగా లేనప్పుడు ప్రపంచం అంతా సురక్షితంగా లేదు. అమెరికా యుగం అయిపోయిందని మన శత్రువులు భావిస్తున్నారు. అది తప్పు. గత దశాబ్దం నుంచి ఉన్న నాయకులను నమ్ముతున్నంత వరకు 21వ శతాబ్దంలో విజయం సాధించలేం. నా తల్లిదండ్రులు భావిస్తున్న దేశం కాదు ఇది. నా పిల్లలకు అందించే అమెరికా కాదు ఇది అని అన్నారు.






