మరో షాకిచ్చిన మెలానియా ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓటమి తరువాత ఆయన వైవాహిక జీవితం విచ్ఛిన్నం దిశగా అడుగులు వేస్తోంది. ఆయన నుంచి మెలానియా ట్రంప్ విడాకులు తీసుకోనున్నదనే వార్తలు పెద్ద ఎత్తున ప్రచారమవుతున్నాయి. వెటరన్స్ డే సందర్భంగా తన భార్య మెలానియాతో కలసి ఆర్లింగ్టన్ జాతీయ శ్మశానవాటికను సందర్శించారు. ఈ సందర్భంగా ఊహించని ఘటన చోటు చేసుకుంది. మెలానియా ప్రవర్తించిన తీరు అందరినీ షాక్కు గురి చేసింది. తన భర్తతో కలసి నడవకుండా ఓ సైనికుడి చెయి పట్టుకుని మెలానియా నడిచింది. ఈ ఘటనతో అక్కడి వారు దిగ్భ్రాంతికి గురుయ్యారు. ఈ ఘటన తరువాత వీరిద్దరూ విడిపోనున్నారనే వార్తకు మరింత బలం వచ్చింది. జనవరిలో ట్రంప్ అధ్యక్ష పీఠం నుంచి వైదొలగగానే వీరి వివాహబంధం ముగుస్తుందని చెబుతున్నారు.






