సెనెటర్ పదవికి కమలా హారిస్ రాజీనామా..
అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన డెమోక్రాట్ నేత కమలా హారిస్ తన సెనెటర్ పదవికి అధికారికంగా రాజీనామా చేశారు. అమెరికాలోని ఎగువసభ సెనెట్‌లో ఆమె పదవీ కాలం కూడా ముగిసింది. దేశ అధ్యక్షుడిగా జో బైడెన్‌తో పాటు ఉపాధ్యక్షురాలిగా ఆమె ప్రమాణం చేయనున్నారు. ఇదిలా ఉంటే అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి నల్ల జాతీయురాలు, తొలి దక్షిణాసియా మహిళగా కూడా కమలా హారిస్ రికార్డు నెలకొల్పనున్నారు. కమలా హారిస్ తన రాజీనామా లేఖను కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసన్కు పంపారని ఆమె సన్నిహితులు తెలిపారు. 2016 నవంబర్‌లో సెటెన్కు ఎన్నికైన హారిస్, 2017 జనవరిలో ప్రమాణం చేశారు. కాలిఫోర్నియా నుంచి సెనెట్‌కు ఎన్నికైన తొలి నల్ల జాతీయురాలిగా కూడా ఆమె రికార్డు నెలకొల్పారు. సెనెట్‌కు ఎన్నికైన సమయంలో కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గానూ ఆమె వ్యవహరించారు.






