జో బైడెన్ కు షాక్.. పోటీ నుంచి తప్పుకున్న నీరా టండన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ క్యాబినెట్లో దక్కాల్సిన పోస్టును నీరా టండన్ కోల్పోయారు. భారతీయ సంతతికి చెందిన నీరా టండన్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ ఆఫీసు డైరక్టర్గా పోటీపడాలని కాంక్షించారు. అయితే ఆ పోటీ నుంచి నామినేషన్ ఉపసంహరిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. అధ్యక్షుడు బైడెణ్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. వాస్తవానికి బైడెన్ బృందంలో మహిళలు ఎక్కువే ఉన్నారు. అనేక మంది మహిళలకు క్యాబినెట్ హోదాను కల్పించారు. బడ్జెట్ ఆఫీసుకు డైరక్టర్గా నీరాను నామినేట్ చేస్తున్నట్లు గత నవంబర్లో బైడెన్ ప్రకటించారు. కానీ నీరా టండన్కు డెమోక్రాట్ల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఇటీవల ఆమె చేసిన కొన్ని ట్వీట్లే ఆమెకు అవరోధంగా మారినట్లు అనుమానిస్తున్నారు. బడ్జెట్ డైరక్టర్గా క్యాబినెట్ హోదాను పొందాల్సిన నీరా లండన్ అనూహ్య రీతిలో పోటీ నుంచి తప్పుకున్నారు. నీరా నామినేషన్ ఉపసంహరణను శ్వేత సౌధం కూడా అంగీకారం తెలిపింది.
ఒకవేళ బడ్జెట్ డైరక్టర్ పదవికి నీరా టండన్ ఎంపికైతే, ఆ పదవిని అలంకరించిన తొలి భారతీయ అమెరికన్ ఆమె అయ్యేవారు. సేనెట్లో ఓట్లు నెగ్గే బలం లేని కారణంగానే నీరా టండన్ను తప్పించినట్లు తెలుస్తోంది. అయితే తమ ప్రభుత్వంలో నీరాకు మరో కీలక పదవిని అప్పగిస్తామని బైడెన్ ఓ ప్రకటనలో తెలిపారు. వెస్ట్వర్జీనియాకు చెందిన డెమోక్రాట్ సేనేటర్ జో మాన్చిన్ వ్యతిరేకించడంతో టండన్ నామినేషన్ పక్రియ నిలిచిపోయింది. నీరా టండన్ స్థానంలో మరో మైనార్టీకి ఆ అవకాశం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.






