యుక్తవయసు దాటిన పిల్లలకు.. అమెరికా శుభవార్త
దీర్ఘకాల వీసాలకు సంబంధించి యుక్త వయసు దాటిన పిల్లలతో అమెరికా వచ్చే వారికి అధ్యక్షుడు జో బైబెన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. చైల్డ్ స్టేటస్ ప్రొటెక్షన్ యాక్ట్ (సీఎస్పీఏ)కు సంబంధించి కీలకమైన మార్పు చేసింది. ఇది చిన్న నిర్ణయమే అయినా ముఖ్యమైనదని ప్రత్యేకించి భారతీయులకు ఉపయోగకరమని అంటున్నారు. కుటుంబం స్పాన్సర్ చేసే లేదా ఉద్యోగ ఆధారిత వీసా ద్వారా అమెరికాలో చట్టబద్ధమైన శాశ్వత వీసా పొందేందుకు కుటుంబంతో సహా ఆ దేశానికి వచ్చే పిల్ల వయసు 21 ఏళ్లలోపు ఉండాలి. తల్లిదండ్రుల పిటిషన్ మేరకు వారితో ఆ దేశానికి వలస వచ్చే పిల్లల వయసు ఇమిగ్రేషన్ ప్రాసెస్ జరిగే నాటికి 21 ఏళ్లు దాటితే సహజంగానే వీసా పొందేందుకు అనర్హులవుతారు. అయితే దరఖాస్తు చేసే నాటికి ఉన్న వయసును ఫైనల్ యాక్షన్ చార్ట్ విడుదల చేసే సమయంలో పరిగణించేలా తాజాగా మార్పు చేశారు. ఈ నిర్ణయం వల్ల దాదాపు 2 లక్షల మంది లబ్ది పొందే అవకాశం ఉంది. తాము ఎంతో కాలంగా కోరుకుంటున్న సవరణ ఇదని ఇంప్రూవ్దిడ్రీమ్. ఆర్గ్కు చెందిన దీప్ పటేల్ అభిప్రాయపడ్డారు.













