భారత సంతతి మహిళకు కీలక పదవి….

అగ్రరాజ్యం అమెరికాలో మరో ఇండియన్ అమెరికన్‍కు అరుదైన గౌరవం దక్కింది. జో బైడెన్ బృందంలో భారత సంతతి మహిళలకు కీలక పదవి దక్కింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‍కు సీనియర్ సలహాదారుగా నీరా టాండన్‍ను నియమితులయ్యారు. ఈ విషయాన్ని వైట్‍హౌస్ స్పష్టం చేసింది.గతంలో నీరాను వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్‍మెంట్ అండ్ బడ్జెట్ డైరెక్టర్ (ఒఎంబీ) నియమించాలని బైడెన్ భావించినప్పటికీ, విపక్షాలతో పాటు సొంత పార్టీ నేతల నుండి పలు విమర్శలు రావడంతో ఆమె నామినేషన్‍ను ఉపసంహరించుకున్న సంగతి విదితమే. తాజాగా నీరాను బైడెన్ సీనియర్ సలహాదారుగా నియమిస్తున్నట్లు వైట్ హౌస్ తెలిపింది. నీరా గతంలో మాజీ అధ్యక్షుడు ఒబామాకు, మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‍కు సలహాదారుగా వ్యవహరించారు.