Donald Trump: జెలెన్‌స్కీ యుద్దాన్ని పొడిగిస్తున్నారు : ట్రంప్

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ(Zelensky) పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరోసారి విరుచుకుపడ్డారు. శాంతి ఒప్పందంలో భాగంగా క్రిమియాను రష్యా(Russia )కు అప్పగించే విషయంలో వెనక్కి తగ్గకుండా రష్యా-ఉక్రెయిన్ (Ukraine) యుద్ధాన్ని జెలెన్‌స్కీ పొడిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ భూభాగాన్ని రష్యాకు అప్పగించే ఆలోచనను తోసిపుచ్చిన జెలెన్‌స్కీ మాట్లాడటానికి ఏమీ లేదు. ఇది మా భూమి, ఉక్రేనియన్ ప్రజల భూమి అని ఉద్ఠాటించారు. ఆ వ్యాఖ్యలపై స్పందించిన ట్రంప్ ఈ ప్రకటన రష్యాతో శాంతి చర్చలకు చాలా హానికరమన్నారు. ఇది చర్చనీయాంశం కూడా కాదని ట్రంప్ పేర్కొన్నారు. ఒబామా (Obama) అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ఉక్రెయిన్ క్రిమియాను కోల్పోయిందని, క్రిమియా కావాలనుకుంటే పదకొండేళ్ల కిందట రష్యాకు అప్పగించినప్పుడు వారు దాని కోం ఎందుకు పోరాడలేదని ఆయన ప్రశ్నించారు.