టిక్‍టాక్, విచాట్లపై.. నిషేధం ఉపసంహరణ?

పాపులర్ యాప్‍లైన టిక్‍టాక్, వి చాట్‍లను నిషేధించాలని డొనాల్డ్ ట్రంప్ కాలం నాటి ఆదేశాలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం ఉపసంహరించింది. వీటివల్ల జాతీయ భద్రతకు గల ముప్పు ఎంతో గుర్తించడానికి తమ స్వంతంగా సమీక్ష నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. చైనా రూపొందించిన లేదా సరఫరా చేసిన యాప్‍ల లావాదేవీలను సాక్ష్యాధారాల ప్రాతిపదికన విశ్లేషించాలని వాణిజ్య శాఖను శ్వేతసౌధం ఆదేశించింది.