Suryakumar Yadav: టీ20లకు సూర్యకుమార్ గుడ్‌బై? ఫైనల్ తర్వాతే ప్రకటన!
భారత క్రికెట్ అభిమానులకు మరో సంచలన వార్త. 2024 టీ20 ప్రపంచకప్ విజయానంతరం దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన తరహాలోనే.. ప్రస్తుత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) కూడా అదే బాట పట్టనున్నట్లు క్రికెట్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20 వరల్డ్ కప్ ఫైనల్ పోరు అనంతరం ఆయన అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.
తప్పుకునే యోచనలో సూర్య..
ప్రస్తుతం 35 ఏళ్ల వయసులో కెరీర్ చరమాంకానికి చేరుకున్న సూర్య(Suryakumar Yadav).. కేవలం టీ20 ఫార్మాట్‌కే పరిమితమైనప్పటికీ కొంతకాలంగా బ్యాటర్‌గా తీవ్ర ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. ఫైనల్ మ్యాచ్‌లో గెలిచినా, ఓడినా ఆయన తప్పుకోవడం ఖాయమనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఒకవేళ కప్ గెలిస్తే, ఛాంపియన్‌గా సగర్వంగా వీడ్కోలు పలకడానికి ఇంతకంటే గొప్ప సందర్భం ఉండదని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
అలా కాకుండా జట్టు ఓడితే, పేలవ ఫామ్ సాకుతో భవిష్యత్తులో సెలెక్టర్లు వేటు వేసే ప్రమాదం లేకపోలేదు. ఈ పరిస్థితి రాకముందే తనంతట తానే గౌరవప్రదంగా జట్టు నుంచి తప్పుకోవాలని సూర్య (Suryakumar Yadav) భావిస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాత టీ20 పగ్గాలను యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌కు అప్పగించే యోచనలో బోర్డు ఉన్నట్లు తెలుస్తోంది.
కెప్టెన్‌గా హిట్.. బ్యాటర్‌గా ఫ్లాప్..
నాయకుడిగా సూర్య (Suryakumar Yadav) రికార్డు అత్యంత అద్భుతంగా ఉంది. ఆయన సారథ్యంలో భారత జట్టు ఒక్క ద్వైపాక్షిక సిరీస్ కూడా కోల్పోలేదు. గతేడాది ఆసియా కప్‌ను కైవసం చేసుకోవడమే కాకుండా, ఇప్పుడు వరల్డ్ కప్ ఫైనల్‌కు కూడా చేర్చాడు. కానీ నాయకత్వ భారం ఆయన వ్యక్తిగత ఆటతీరుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. కెప్టెన్సీ చేపట్టాక ఆడిన 41 మ్యాచ్‌ల్లో సూర్య కేవలం 932 పరుగులే చేశాడు. గతంలో 44గా ఉన్న అతడి బ్యాటింగ్ సగటు.. నాయకుడయ్యాక ఏకంగా 26.62కి దారుణంగా పడిపోవడం ఆయన (Suryakumar Yadav) ఫామ్ లేమికి అద్దం పడుతోంది.
ఇవి కూడా చదవండి

















