IND vs WI: టీమిండియా సంచలన విజయం.. ఒంటిచేత్తో గెలిపించిన సంజూ!
టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన ‘డూ ఆర్ డై’ సూపర్-8 మ్యాచ్‌లో (INDvsWI) భారత జట్టు అద్భుత విజయం సాధించింది. 196 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 4 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో అద్భుత పోరాట పటిమ కనబర్చిన టీమిండియా దర్జాగా సెమీ-ఫైనల్లో అడుగుపెట్టింది.
సంజూ శాంసన్ అజేయ పోరాటం..
లక్ష్య ఛేదనలో భారత్‌కు (INDvsWI) ఆశించిన శుభారంభం దక్కలేదు. ఓపెనర్ అభిషేక్ శర్మ (10), ఇషాన్ కిషన్ (10), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (18) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. భారత్ సెమీస్ ఆశలు గల్లంతయ్యాయని అభిమానులు నిరాశలో మునిగిపోయారు. సరిగ్గా అప్పుడే ఓపెనర్‌గా బరిలోకి దిగిన సంజూ శాంసన్ (97 నాటౌట్) జట్టుకు అడ్డుగోడలా నిలబడ్డాడు. అత్యంత ఒత్తిడి (INDvsWI) పరిస్థితుల్లోనూ ఎంతో ప్రశాంతంగా ఆడుతూ.. కరేబియన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆఖరి ఓవర్ తొలి రెండు బంతులను 6, 4గా మలిచి లాంఛనం పూర్తి చేశాడు. ఒంటిచేత్తో జట్టును గెలిపించిన శాంసన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
ఇవి కూడా చదవండి
మలుపు తిప్పిన క్యాచ్‌లు..
సంజూ శాంసన్‌కు తోడుగా మిడిలార్డర్ బ్యాటర్లు కీలక పరుగులు జోడించారు. 15 బంతుల్లోనే 27 పరుగులు చేసి ప్రమాదకరంగా మారిన తిలక్ వర్మను.. హెట్మెయర్ బౌండరీ లైన్ వద్ద ఒక అద్భుతమైన క్యాచ్‌తో (INDvsWI) పెవిలియన్ పంపాడు. దీంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. అయితే 9 పరుగుల వద్ద ఉన్న హార్దిక్ పాండ్యా (17) ఇచ్చిన అతి సులభమైన క్యాచ్‌ను జాసన్ హోల్డర్ జారవిడిచాడు. ఇది విండీస్ పాలిట శాపంగా మారింది. ఆ తర్వాత శివమ్ దూబె రెండు కీలక ఫోర్లు బాది భారత్ విజయ సమీకరణాన్ని మరింత సులభతరం చేశాడు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
విండీస్ భారీ స్కోరు..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ (INDvsWI) 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ రోస్టన్ చేజ్ (25 బంతుల్లో 40), షాయ్ హోప్ (32), హెట్మెయర్ (27) తమదైన శైలిలో రాణించారు. ఒకే ఓవర్లో హెట్మెయర్, చేజ్‌లను అవుట్ చేసిన జస్ప్రీత్ బుమ్రా విండీస్‌ను దెబ్బకొట్టాడు. ఒక దశలో 119/4తో కట్టడి అయ్యేలా కనిపించిన విండీస్ (INDvsWI).. డెత్ ఓవర్లలో పావెల్, హోల్డర్ మెరుపులతో ఆ మాత్రం స్కోరు సాధించగలిగింది.
ఇవి కూడా చదవండి

















