22ఏ జాబితా నుంచి త్వరలోనే తొలగిస్తాం : మంత్రి పొంగులేటి
ప్రైవేటు వ్యక్తుల ఆస్తికి ఆటంకం కలిగించాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy) అన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రైవేటు భూమిని 22ఏలో పెట్టారంటూ మేడ్చల్ (Medchal), హైదరాబాద్ (Hyderabad), రంగారెడ్డి (Ranga Reddy), సంగారెడ్డి (Sangareddy) జిల్లాల నుంచి 750 అప్లికేషన్లు వచ్చాయని తెలిపారు. 22ఏ భూములపై నాలుగు జిల్లాల్లోని అధికారులతో కలిసి చర్చించాం. గతంలో ఆ భూములు యుఎల్‌సీ జాబితాలో ఉన్నాయి. నిషేధిత జాబితాను అప్డేట్ చేయడంలో పొరపాటు జరిగింది. అధికారుల తరపున క్షమాపణలు కోరుతున్నాం. ప్రైవేట్ ఆస్తుల్ని 22ఏ జాబితా నుంచి త్వరలోనే తొలగిస్తాం. దీనికి సంబంధించి ఫిర్యాదులు ఉంటే టోల్‌ఫ్రీ నంబర్ 18005994788కు సప్రందించాలి. భూములకు సంబంధించి అన్నీ సక్రమంగా ఉన్నవారు ఆందోళన చెందవద్దు అని అన్నారు.








