సీఎం పరిస్థితే అలా ఉంటే .. ప్రజల పరిస్థితి ఏంటి? : హరీశ్‌రావు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇల్లు (House,)కూడా నిషేధిత జాబితాలో ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. అందుకే జాబితా నుంచి తొలగించాలని హడావుడి చేస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ సీఎం పరిస్థితే అలా ఉంటే, ప్రజల పరిస్థితి ఏంటి? నిషేధిత జాబితాలో ఆస్తులు ఎందుకు పెట్టారో విచారణ జరిపించాలి. ఎన్ని ఆస్తులు అలా పెట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలి. ఆ జాబితా నుంచి ఎప్పటిలోపు తొలగిస్తారో ప్రభుత్వం చెప్పాలి. నిషేధిత జాజితా భూముల గురించి ఆర్టీఐ (RTI) ద్వారా అడుగుతుంటే సమాధానం లేదు అని అన్నారు.








