Telangana: బడ్జెట్ ధమాకా.. రాష్ట్ర ప్రజలకు సర్కార్ అదిరిపోయే కానుక..
Telangana Budget 2026: తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్లో సామాన్యులకు భరోసానిచ్చేలా ప్రభుత్వం ఒక భారీ సంక్షేమ పథకాన్ని ప్రకటించింది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించడమే లక్ష్యంగా ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకాన్ని తీసుకువస్తున్నట్లు ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీ వేదికగా వెల్లడించారు.
పథకం అంశాలు:
అందరికీ వర్తింపు: పేద, మధ్యతరగతి, ధనిక అనే తేడా లేకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.15 కోట్ల కుటుంబాలకు ఈ బీమా సౌకర్యం కల్పిస్తారు.
భారీ ఇన్స్యూరెన్స్: ఇంటి పెద్దకు దురదృష్టవశాత్తూ ఏదైనా జరిగితే, ఆ కుటుంబానికి రూ. 5 లక్షల జీవిత బీమా అందజేస్తారు.
ప్రారంభ తేదీ: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 2026 జూన్ 2 నుంచి ఈ పథకాన్ని అధికారికంగా అమలు చేయనున్నారు.
రాష్ట్ర ప్రజలందరికీ సామాజిక భద్రత కల్పించాలనే సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి








