పేద విద్యార్థుల ఉన్నత చదువులకు.. ‘పీఎం విద్యాలక్ష్మి’ భరోసా !
PM Vidyalaxmi: ఎంత కష్టపడి చదివినా, ఆర్థిక స్తోమత లేక ఉన్నత చదువులకు దూరమవుతున్న పేద విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం ‘పీఎం విద్యాలక్ష్మి’ పథకాన్ని అమలు చేస్తోంది. ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్, మెడిసిన్, మేనేజ్మెంట్ వంటి ప్రొఫెషనల్ కోర్సులు చదవాలనుకునే వారికి ఈ పథకం ఒక వరంలా మారింది.
పథకంలోని అంశాలు..
విద్యా రుణాలు..
ఈ పథకం కింద ఎటువంటి కోలాటరల్ (పూచీకత్తు) లేదా గ్యారెంటర్ లేకుండానే బ్యాంకులు విద్యా రుణాలు మంజూరు చేస్తాయి. కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే కాకుండా, వసతి, రవాణా , ఇతర విద్యా సంబంధిత ఖర్చులను కూడా ఇందులో పరిగణనలోకి తీసుకుంటారు.
75 శాతం క్రెడిట్ గ్యారంటీ..
రూ. 7.5 లక్షల వరకు తీసుకునే రుణాలకు కేంద్ర ప్రభుత్వమే 75 శాతం క్రెడిట్ గ్యారంటీని ఇస్తుంది. దీనివల్ల బ్యాంకులు రుణాల మంజూరులో వెనకాడవు. దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోనే రుణ మంజూరుపై స్పష్టత వస్తుంది.
అర్హతలు , దరఖాస్తు విధానం..
కోర్సులు: ఇంజనీరింగ్, వైద్యం, ఆర్కిటెక్చర్, సీఏ వంటి ప్రొఫెషనల్ కోర్సులతో పాటు సాధారణ డిగ్రీ చదివే విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. విదేశీ విద్యకు కూడా ఈ అవకాశం ఉంటుంది. 10వ తరగతి, ఇంటర్ మార్కుల జాబితాలు, కోర్సు అడ్మిషన్ లెటర్ , ఆదాయ ధృవీకరణ పత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.
దరఖాస్తు ప్రక్రియ..
విద్యార్థులు నేరుగా pmvidyalaxmi.co.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోర్టల్ ద్వారా తమ దరఖాస్తు స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునే సౌకర్యం కూడా ఉంది.
రుణాల మొత్తాన్ని మూడు విభాగాలుగా (రూ. 4 లక్షల లోపు, రూ. 4 నుండి 7.5 లక్షలు, రూ. 7.5 లక్షల కంటే ఎక్కువ) వర్గీకరించి, కోర్సు ఫీజులకు అనుగుణంగా బ్యాంకులు నిర్ణయం తీసుకుంటాయి.
ఇవి కూడా చదవండి







